: ఆసియా క్రీడల స్క్వాష్ విభాగంలో భారత్ కు రజతం
ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ కు రజత పతకం లభించింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో భారత క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ ఓటమి పాలయ్యాడు. దాంతో, అతను రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కువైట్ క్రీడాకారుడు అబ్దుల్లా అల్ చేతిలో 3-2 తేడాతో సౌరవ్ ఓడిపోయాడు.