: మీ స్మార్ట్ ఫోన్ కు మీరే శిక్షణ ఇవ్వొచ్చు!


మార్కెట్లో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్లలో సంజ్ఞల ఆధారంగా పనిచేసే వ్యవస్థలు ఉంటాయి. అయితే, ఆ సంజ్ఞలన్నింటినీ ముందుగానే ఫోన్ లో నిక్షిప్తం (ప్రీ-సెట్) చేసి ఉంటారు. భవిష్యత్తులో, మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఆశిస్తున్న విషయాన్ని మీదైన సంజ్ఞలతో రాబట్టుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా, మీ ప్రత్యేక సంజ్ఞలను మీ స్మార్ట్ ఫోన్ కు నేర్పించడమే. వాటిని ఒక్కసారి సెట్ చేస్తే, మీరు చేతితో సంజ్ఞ చేసినప్పుడల్లా, దాన్ని అనుసరించి సంబంధిత విధిని మీ స్మార్ట్ ఫోన్ నిర్వర్తిస్తుందన్నమాట. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జెశ్చర్ రికాగ్నిషన్ టెక్నాలజీ ఉన్న ఫోన్లలో కెమెరాలు సంజ్ఞలను గుర్తిస్తాయి. అందుకు ఎంతో బ్యాటరీ పవర్ ఖర్చయిపోతుంది. పైగా, చేతుల కదలికలు స్పష్టంగా ఉండాలి. కానీ, తమ నూతన జెశ్చర్ సెన్సింగ్ టెక్నాలజీ తక్కువ శక్తిని వినియోగించుకుంటుందని పరిశోధకులు మాట్ రేనాల్డ్స్, శ్వేతక్ పటేల్ తెలిపారు. ఫోన్ కు చుట్టూ ఏ దిశలో సంజ్ఞ చేసినా గుర్తించగలగడం తమ టెక్నాలజీ ప్రత్యేకత అని చెప్పారు.

  • Loading...

More Telugu News