: మాంగర్ బస్తీ అంటే హైదరాబాద్ పోలీసులకి కూడా భయమే... అందుకే కార్డాన్ సెర్చ్ ఆపరేషన్


హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు సోమవారం అర్థరాత్రి కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో సుమారు 100 మంది దొంగలను, ఇద్దరు సైకో కిల్లర్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి, హబీబ్ నగర్ లో జరిగిన హత్య కేసుల్లో నిందితులైన అమీర్, టిల్లు, ఖలీద్ లు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో అనుకోకుండా పట్టుబడ్డారు. వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో ఎటువంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు జరిగినా పోలీసులకు వెంటనే గుర్తొచ్చేది మాంగర్ బస్తీ. మాంగర్ బస్తీ అంటే పోలీసులకి కూడా భయమే. దర్యాప్తులో్ భాగంగా ఈ ప్రాంతానికి వెళితే... మూకుమ్మడిగా బస్తీ వాసులు (ముఖ్యంగా మహిళలు) పోలీసులపై దాడి చేసి, వారిపైనే ఎదురు కేసులు పెట్టేవారు. దీంతో, మాంగర్ బస్తీలోకి వెళ్లడానికి పోలీసులు కూడా బాగా జంకేవారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఈ కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. యథావిధిగానే, ఈ ఆపరేషన్ లో కూడా స్థానికుల నుంచి పోలీసులకి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే, పోలీసులు పకడ్బందీగా వెళ్లడంతో ఆపరేషన్ విజయవంతమయ్యింది.

  • Loading...

More Telugu News