: గోకుల్ ఛాట్ వద్ద జనాలను పరుగులు పెట్టించిన సూట్ కేస్


గతంలో హైదరాబాదు జరిగిన గోకుల్ ఛాట్ పేలుళ్లను, ఆ మారణహోమాన్ని ఎవరూ మర్చిపోలేరు. సరిగ్గా అక్కడే ఈరోజు సాయంకాలం ఓ సూట్ కేసు కలకలం రేపింది. గోకుల్ ఛాట్ లోని ఓ గోడ పక్కన సూట్ కేస్ ను చూసిన కొందరు పోలీసులకు సమాచారమందించారు. క్షణాల్లో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాంబు నిర్వీర్యదళం చేరుకునేసరికి వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ప్రజలు పరుగందుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నియంత్రించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2007లో గోకుల్ ఛాట్ పేలుళ్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది శాశ్వత వికలాంగులుగా మారారు.

  • Loading...

More Telugu News