: ఆర్టీసీ ఆభివృద్ధికి రూ.250 కోట్లు విడుదల


ఆర్టీసీ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీసీఎస్ బకాయిలు త్వరలో చెల్లిస్తామని అన్నారు. 5.5 శాతం కరవు భత్యం కూడా చెల్లిస్తామని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు 3 వేల రూపాయలు పండగ అడ్వాన్సుగా అందజేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్ల వ్యవహారంలో కోర్టు మొట్టికాయలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

  • Loading...

More Telugu News