: వివాదం ఉన్నప్పటికీ శివసేన మద్దతు మోడీకే!


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై బీజేపీ, శివసేన మధ్య వివాదం అలాగే ఉంది. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో, దశాబ్దాల మైత్రీ బంధం నిలుస్తుందో లేదో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో శివసేన, బీజేపీతో పొత్తుకు ఓకే చెప్పనప్పటికీ మోడీకి మద్దతు పలికింది. మోడీ అన్ని వర్గాల నాయకుడని శివసేన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. భారత ముస్లింలు దేశం కోసమే జీవిస్తారు, దేశం కోసమే మరణిస్తారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను శివసేన ప్రశంసించింది. మోడీ ముస్లిం వ్యతిరేకి కాదని, ముస్లింలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండొద్దంటూ సూచించింది. ఎవరో కొందరు వ్యక్తుల వల్ల సామాజిక వర్గాన్నంతటినీ తప్పు పట్టకూడదని 'సామ్నా'లో హితవు పలికింది.

  • Loading...

More Telugu News