: కర్నూలులో భారీ అగ్నిప్రమాదం


పేదవాడి కష్టం బుగ్గిపాలయింది. రెక్కాడితే కాని డొక్కాడని కష్ట జీవులపై కాలాగ్ని కోరలు చాచింది. ఒక చిన్న నిప్పు రవ్వ వారి కష్టార్జితాన్ని బూడిద చేసింది. కర్నూలు ఆదిత్యనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 గుడిసెలు దగ్ధమయ్యాయి.

ఇక్కడున్న వారంతా రోజువారి కూలీలే కావటంతో ఉదయాన్నే పనులకు వెళ్లారు. దీంతో ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే గుడిసెల్లోని దుస్తులు, వంట సామాగ్రి, తిండి గింజలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంత్రి టీజీ వెంకటేష్ బాధితులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News