: తన చెల్లికి ప్రపోజ్ చేయాలంటే 'ఐఫోన్ 6' ఇచ్చుకోవాలన్న అన్నయ్య
సౌదీలో ఓ యువకుడు తన చెల్లిని ఇష్టపడుతున్న వ్యక్తికి ఓ షరతు విధించాడు. తనకు ముందుగా ఆపిల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 'ఐఫోన్ 6' ఇవ్వాలని, ఆ తర్వాతే తన చెల్లికి ప్రపోజ్ చేయాలని స్పష్టం చేశాడు. దీంతో, ఆ ప్రేమికుడు హతాశుడయ్యాడు. ఇప్పటివరకు సౌదీ మార్కెట్లో 'ఐఫోన్ 6' అడుగుపెట్టకపోవడమే అందుకు కారణం. ఆ ఫోన్ ఎప్పుడొస్తుందో, తన ప్రేమ ఎప్పుడు వెల్లడించాలో అని అతగాడు వేగిపోతున్నాడట. కాగా, ఆపిల్ సంస్థ ఈ అడ్వాన్స్ డ్ ఫోన్ ను అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో మాత్రమే విడుదల చేసింది. ఈ నెల 19న ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మిగతా దేశాల్లో వీటి విడుదల ఆలస్యం కానుంది.