: భారతీయ ప్రముఖ వంటకాలపై సీఎస్ఐ సర్వే
భారతదేశంలో ప్రజలు ఇష్టంగా తినే పులిహోర, హైదరాబాద్ బిర్యానీ, సాంబారు, పిస్తా హలీం, ఆంధ్రా చికెన్ వంటి తదితర ఫేమస్ వంటకాలపై కూలంకష పరిశోధన జరగనుంది. దాదాపు 20వేల దేశీయ వంటకాలపై వచ్చే ఐదేళ్ల పాటు 'కలినరీ సర్వే ఆఫ్ ఇండియా' (సీఎస్ఐ) అధ్యయనం చేయనుంది. పలు ప్రాంతాలు తిరిగి అక్కడ ప్రత్యేకంగా వండే వంటలు, బాగా పాప్యులర్ అయిన వంటల పుట్టుపూర్వోత్తరాలు, వాటిని తయారుచేసే విధానాన్ని క్షుణ్ణంగా సీఎస్ఐ అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 24 నగరాల్లో సీఎన్ఐ నిపుణులు పర్యటించనున్నారు. తర్వాత వంటకాల వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేసి ప్రపంచానికి అందించనున్నారు.