: జార్ఖండ్ ఎమ్మెల్యేల సౌందర్య పోషణ!
జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) పార్టీ అధినేత బాబూలాల్ మరాండీ, ఆ పార్టీ ఇతర ఎమ్మెల్యేలు ఇటీవల సౌందర్య పోషణపై అమిత శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు మరాండీ తదితరులు రాంచీలోని ఓ బ్యూటీ పార్లర్ కు వెళ్ళారు. అక్కడ ఫేషియల్, బ్లీచింగ్ వంటివి చేయించుకున్నారట. దీనిపై, మరాండీ మాట్లాడుతూ, అందంగా కనిపించడం ఎంతో అవసరమని అన్నారు. నేటి కాలంలో ఇంటా బయటా ఆకర్షణీయంగా కనిపించక తప్పదని సెలవిచ్చారు.