: ఆసియా క్రీడల్లో భారత్ కు జరిమానా


దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశానికి జరిమానా పడింది. ఆసియా క్రీడల్లోని కొన్ని క్రీడాంశాల్లో చివరి నిమిషంలో భారత్ తప్పుకుంది. దీంతో దీని ప్రభావం షెడ్యూల్ పై పడింది. దీనిపై ఆగ్రహించిన ఆసియా క్రీడల కమిటీ, భారత్ పై అపరాధం విధించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కమిటీ వెనక్కు తీసుకుంటుందని భారత్ నమ్మకం వ్యక్తం చేసింది. కాగా, జరిమానా ఎంతనే వివరం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News