: మన ఐటీ దిగ్గజాల్లో మహిళలు ఇంత మంది


దేశ ఐటీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య సుమారు లక్షకు పైగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో దేశంలోని ఐటీ కంపెనీల్లో మహిళలకు అగ్రస్థానం కల్పించిన సంస్థల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రధమ స్థానంలో ఐబీఎం ఉంది. ఐబీఎంలో 4.31 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో లక్షా 30 వేల మంది మహిళా ఉద్యోగులు కావడం విశేషం. ద్వితీయ స్థానంలో లక్షకు పైగా మహిళా ఉద్యోగులు కలిగిన టీసీఎస్ నిలవగా, 54, 537 మంది మహిళా ఉద్యోగులతో తృతీయ స్థానంలో ఇన్ఫోసిస్ నిలిచింది. విప్రోలో 45,276 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

  • Loading...

More Telugu News