: పవన్ కల్యాణ్ ను చూసే చిరంజీవిని గౌరవిస్తున్నారు: చింతమనేని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శల దాడి చేసిన కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి చిరంజీవిపై టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చిరంజీవికి బుద్ధిరాకపోవడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. పవన్ కల్యాణ్ వల్లే చిరంజీవిని కాస్తోకూస్తో గౌరవిస్తున్నారని, దాన్ని ఆయన నిలుపుకోవాలని హితవు పలికారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి తీరు మార్చుకోవాలని చింతమనేని సూచించారు. విమానాల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం మినహా చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని చిరు విమర్శించడం తెలిసిందే.