: మిత్రుడు మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో డ్రమ్స్ వాయించిన శివమణి
విఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణి తన మిత్రుడు మాండలిన్ శ్రీనివాస్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. చెన్నైలో జరిగిన శ్రీనివాస్ అంత్యక్రియల సందర్భంగా శివమణి డ్రమ్స్ వాయించి శ్రద్ధాంజలి ఘటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీనివాస్ మరణం వ్యక్తిగతంగా తీరనిలోటు అని తెలిపాడు. ఆయనతో ఎన్నో కచేరీల్లో పాల్గొన్నానని శివమణి గుర్తు చేసుకున్నాడు.