: 'గానకోకిల'ను సత్కరించనున్న క్రికెట్ దేవుడు
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 'గానకోకిల' లతా మంగేష్కర్ ను సత్కరించనున్నాడు. ఈ నెల 28న ఆమె 85వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ముంబయిలో జరిగే ఓ కార్యక్రమంలో సచిన్... తన అభిమాన గాయనిని సత్కరిస్తాడు. దీనిపై హృదయేశ్ ఆర్ట్స్ చైర్మన్ అవినాశ్ ప్రభావల్కకర్ మాట్లాడుతూ, ఈ సన్మాన కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. లత 13 ఏళ్ళ వయసులో, 1943లో, తొలి పాట పాడారు. మరాఠీ చిత్రం 'గజాభావు' చిత్రంతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె, ఇప్పటివరకు 36 భాషల్లో 1000కి పైగా పాటలు పాడారు.