: 'తప్పురా' అన్నందుకు టీచర్ చెంప చెళ్లు మనిపించాడు


టీచర్లు విద్యార్థులను దండిస్తే గుండెలు బాదుకునే కుహనా వాదులే దీనికి సమాధానం చెప్పాలి. విద్యార్థిని టీచర్ దండిస్తే తప్పు, మరి విద్యార్థి టీచర్ చెంప చెళ్లుమనిపిస్తే దానిని ఏమనాలి? విద్య నేర్పిన గురువు, నీ ప్రవర్తన తప్పు అని చెప్పినందుకు ఆమెను చెంప దెబ్బకొట్టాడో విద్యార్థి. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని తరగతిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు గమనించి, వాడిని హెచ్చరించేందుకు ఆ నిర్వాకాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించారు. దానికి సదరు విద్యార్థి అభ్యంతరం చెప్పాడు. అది డిలీట్ చేయాలంటూ ఉపాధ్యాయురాలితో వాదనకు దిగాడు. టీచర్‌నే ఎదిరిస్తావా? అంటూ సదరు ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థి చెంపపై ఒక్కటేశారు. అంతే, అప్పటికే ఆమెపై ధుమధుమలాడిన విద్యార్థి, ఎదురు తిరిగి ఉపాధ్యాయురాలి చెంప చెళ్లు మనిపించాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News