: ఉద్యమాల సందర్భంగా ఒత్తిడి తెచ్చారు... ఇప్పుడు కృషి చేయండి: బాబు
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా తనపై నేతలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. హైదరాబాదులోని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు టీడీపీని జాతీయ పార్టీగా చేసేందుకు నేతలు కృషి చేయాలని అన్నారు. వచ్చే మహానాడు నాటికి టీడీపీని జాతీయపార్టీగా ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని ఆయన నేతలకు సూచించారు.