: పాక్ బాటలోనే చైనా... మరో కార్గిల్ తీరుగా!


పాకిస్థాన్ బాటలోనే చైనా కూడా నడుస్తోంది. వరుసగా చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ను చైనా ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. భారత భూభాగం నుంచి వెనక్కి మళ్లి రెండు రోజులు కూడా పూర్తి కాకముందే చైనా మరోసారి చొరబడింది. హిమచల్ ప్రదేశ్ లోని లడఖ్ ప్రాంతానికి చెందిన చివరి గ్రామం చుమర్. ఈ ప్రాంతం తమదేనంటూ చైనా చాలా కాలంగా వాదిస్తోంది. చైనా అధ్యక్షుడి పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి భారీగా బలగాలను మోహరించిన చైనా, సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు రేపింది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారత సైనికులను కూడా భారీగా తరలించింది. దీంతో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సరిహద్దు వివాదం గురించి చర్చించారు. దీంతో మరలిన చైనా సైనికులు వాస్తవాధీన రేఖ దాటి దగ్గర్లోని ఓ పర్వతంపైకి చేరారు. గతంలో కార్గిల్ లో కూడా పాక్ సైనికుల సాయంతో ఉగ్రవాదులు కూడా ఇలా పర్వతాలపైకి చేరి భారత్ సేనలతో యుద్ధం చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి.

  • Loading...

More Telugu News