: రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం: వేణుగోపాలాచారి సవాలు
మెట్రో ప్రాజెక్టుపై టీడీపీ నేత రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి సవాల్ విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాజధానికి పరిశ్రమలు రాకుండా టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదా? అని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వేణుగోపాలాచారి సవాలు విసరడం విశేషం.