: హృతిక్ కుమారులు కూడా నటిస్తారు: రాకేష్ రోషన్


ఇతర వృత్తుల్లో వారసత్వం కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేము కానీ రాజకీయాలు, సినిమాల్లో మాత్రం వారసత్వమే కొనసాగుతోంది. కాగా బాలీవుడ్ లో అంతగా అచ్చిరాని వారసత్వాన్ని రోషన్ కుటుంబం కొనసాగించాలనుకుంటోంది. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కుమారులు హ్రేహాన్, హ్రిదాన్ లిద్దరూ తండ్రి బాటలోనే నడుస్తారని వారి తాత రాకేష్ రోషన్ తెలిపారు. తన మనవళ్లు బాలీవుడ్ లో అడుగుపెడితే రోషన్ వారసత్వం బాలీవుడ్ లో కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఒక స్క్రిప్టుపై పని చేస్తున్నానని అది పూర్తి కాగానే హృతిక్ తో సినిమా ప్రారంభిస్తానని రాకేష్ రోషన్ తెలిపారు.

  • Loading...

More Telugu News