: యాపిల్ ప్రాభవం కోల్పోతోందట!


ఐపాడ్, ఐఫోన్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను షేక్ చేసిన యాపిల్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందట. అదే సమయంలో ఆండ్రాయిడ్ వెర్షన్ కు నానాటికీ ప్రజాదరణ పెరిగిపోతోందని ఈ నెల ప్రథమార్ధంలో జరిగిన ఓ సర్వే వెల్లడించింది. వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అస్తమయం తర్వాత యాపిల్ ‘కూల్ నెస్’ క్రమంగా కరిగిపోతోందని ఐఫోన్లంటే పడి చచ్చే ఓ మహిళా టెక్కీ చెప్పారు. ఈ మార్పు గడచిన రెండేళ్లలోనే నమోదైందని సర్వేలో పాల్గొన్న 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది తమ ప్రథమ ఓటు యాపిల్ కు వేస్తే, ఆండ్రాయిడ్ వైపు 50 శాతం మంది మొగ్గారట. ఐఫోన్ 6తో పది రోజుల క్రితమే ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న యాపిల్ కు ఇది చేదువార్తే.

  • Loading...

More Telugu News