: నియంత్రణ రేఖ వద్ద 200 మంది మిలిటెంట్లు కాచుకుని కూర్చున్నారు: సైన్యం


భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు దాదాపు 200 మంది పాక్ మిలిటెంట్లు కాచుకుని కూర్చున్నారు. జమ్ము కాశ్మీర్ ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో భద్రతా బలగాల కళ్లుగప్పి, దేశంలోకి చొరబడేందుకు వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. భారీ మందుగుండు సామగ్రి, అత్యాధునిక ఆయుధాలతో నియంత్రణ రేఖ వద్దకు మిలిటెంట్లు చేరుకున్నారని భారత సైనికాధికారి లెఫ్ట్ నెంట్ జనరల్ సుబ్రతా సాహా వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు భారత భూభాగంలోకి చొరబడేందుకు జరిగిన మిలిటెంట్ల యత్నాలను తాము తిప్పికొట్టామని ఆయన చెప్పారు. వరదలతో సామాన్య ప్రజలతో తాము కూడా భారీగానే నష్టపోయామని, అయినా మిలిటెంట్లను మాత్రం భారత భూభాగంపై అడుగుపెట్టనివ్వబోమని సాహా స్పష్టం చేశారు. తమ ప్రతిదాడుల్లో ఇప్పటికే ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News