: స్కాట్ లాండ్ ఓటింగ్ నుంచి భారత్ పాఠం నేర్చుకోవచ్చు: శశిథరూర్


ఐక్య బ్రిటన్ లోనే కలసి ఉంటామని స్కాట్ లాండ్ వాసులు రెఫరెండం ద్వారా వెల్లడించిన నిర్ణయంపై కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందించారు. స్కాట్ లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మంచి, ఆరోగ్యకరమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చారన్నారు. దాంతో భారతదేశానికి ఐక్యమత్యం పాఠంను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ, "కలసి ఉంటామని, ఒకటిగా ఉండిపోతామని చెప్పిన పాఠం చాలా సులభమైంది. నా ఆలోచన ప్రకారం మన దేశం వారి నుంచి చాలా నేర్చుకోవాలి" అని థరూర్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో మనకు చాలా జాతులున్నాయని... కానీ, మనమందరూ ఒక దేశంగా ఉంటున్నామన్నారు. మన జాతీయవాదం ఈ ఉపజాతీయవాదం కంటే మించిపోయిందిగా ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News