: ఛత్తీస్ గడ్ లోని అంతగఢ్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం
ఛత్తీస్ గఢ్ లోని అంతగఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భోజరాజ్ నాగ్ తన సమీప ప్రత్యర్థిపై 60వేల ఓట్ల తేడాతో విజయకేతనం ఎగుర వేశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ ఉసెండీ, కాంకేర్ లోక్ సభ సీటుకు పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆయన అంతగఢ్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీేనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.