: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ సినీ దర్శకుడు


ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ గత అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి వెంకటగిరి చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో... బీవీఎస్ రవి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో, పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీవీఎస్ రవితో పాటు అదే వాహనంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. గతంలో కూడా బీవీఎస్ రవి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓసారి బుక్ అయ్యారు. ఆ సమయంలో, ఆయనకు తోడుగా సినీ హీరో రవితేజ ఉన్నారు. 2011 లో, గోపించంద్ హీరోగా తెరకెక్కిన 'వాంటెడ్' చిత్రానికి ఈయన దర్శకత్వం వహించారు. అలాగే... పరుగు, కింగ్, మున్నా, తులసి, పాండవులు పాండవులు తుమ్మెద, కెమెరా మెన్ గంగతో రాంబాబు... లాంటి పలు పెద్ద చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు.

  • Loading...

More Telugu News