: మీరు మీరు చూసుకోండి... మధ్యలో నన్నెందుకు లాగడం?: బాబు
మెట్రో రైల్ విషయంలో ఎల్ అండ్ టీ సంస్థకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమస్యలు ఉంటే వారే పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మీరూ మీరూ చూసుకోవాల్సిన అంశాల మధ్యలో తనను లాగడం సరికాదని అన్నారు. సమస్యలుంటే ప్రభుత్వం, నిర్మాణ సంస్థ పరిష్కరించుకోవాలని అన్నారు. మెట్రోను బెంగళూరుకు కేటాయిస్తే పోరాడి హైదరాబాదుకు తెప్పించానని బాబు తెలిపారు. మెట్రో ప్రారంభం నుంచీ ఇబ్బందుల్లో ఉండడం తనను కలచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రోను వైఎస్ తన వ్యక్తిగతానికి వాడుకున్నారని ఆయన ఆరోపించారు. రుణమాఫీపై వైఎస్ ఏం చేశారో జగన్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.