: జగదాంబ జంక్షన్ లోని షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం


విశాఖపట్టణంలోని జగదాంబ జంక్షన్ లోని లక్కీ షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా విశాఖను తడిపి ముద్ద చేస్తున్న వర్షాల వల్ల లక్కీ షాపింగ్ మాల్ బయట ఉన్న విద్యూత్ దీపాలు ఆపేశారు. ఈ సాయంత్రం వర్షం కాస్త తగ్గడంతో వాటిని వెలిగించారు. దీంతో 5వ అంతస్తును ఆనుకొని ఉన్న విద్యుత్ బోర్డ్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దుకాణ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News