: అట్టహాసంగా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా 17వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక కళాకారుల నృత్యాలు, సంగీత ప్రదర్శన, బాణసంచాల వెలుగులతో ప్రారంభోత్సవం అదిరిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా భారత క్రీడాకారులకు విషెస్ తెలిపారు. ఈ క్రీడల్లో భారత్ గర్వపడే విధంగా వారు సత్తా చాటాలని ఆయన అభిలషించారు. మొత్తం 45 దేశాలు ఈ క్రీడోత్సవాల్లో పోటీపడుతున్నాయి. ఇందులో భారత్ కు చెందిన 500 మందికి పైగా అథ్లెట్లు 29 అంశాల్లో పోటీపడతారు.