: భర్త బండారం బయటపెట్టిన ఫేస్ బుక్ పోస్టింగ్


భర్త బండారం ఫేస్ బుక్ బయటపెట్టింది. మైక్రో ఫ్యామిలీల నేపథ్యంలో ఎక్కువ మంది మాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో సంబంధాలు వెతుక్కోవాల్సి వస్తోంది. వ్యక్తి పూర్వాపరాలతో సంబంధం లేకుండా, కేవలం ఆ వ్యక్తి చెప్పిన వివరాల ఆధారంగానే ఈ తరహా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తరువాత కొన్ని నిజాలు బయటపడడంతో బాధితులు తలబాదుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ లోని ఓ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఓ మహిళ (టీచర్) కు రిక్వెస్ట్ పంపాడు. రెండు నెలల ఛాటింగ్ తరువాత వారిద్దరూ దంపతులయ్యారు. అనంతరం పూణె వెళ్లిపోయారు. అక్కడి నుంచి 2014లో గుర్ గావ్ కు మకాం మార్చారు. ఇంతలో ఆమె ఓ రోజు అతని ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందులో అతని స్నేహితుడు చేసిన ఓ పోస్టింగ్ తో అనుమానం వచ్చిన ఆమె, అతని ప్రొఫైల్, ఫోటోలు పూర్తిగా తనిఖీ చేసింది. దీంతో, అతనికి అప్పటికే పెళ్లైందని, ఓ కుమార్తె కూడా ఉందని బట్టబయలైంది. షాక్ తిన్న ఆమె, తన భర్త తనను వంచించాడంటూ, తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News