: టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుతున్నారు: తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు పప్పు బెల్లాలుగా పంచుతున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రహస్య జీవోల పేరిట అక్రమార్కులకు విందు చేసేందుకు తెరలేపుతున్నారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా బాబు ఎల్లో డ్రెస్ కోడ్ పెట్టారని ఆయన ఆరోపించారు. కానీ, బాబు ఆదేశాలు పాటించేందుకు వారు సిద్ధంగా లేరని ఆయన తెలిపారు.