: మోడీగారూ! మా ఊరికి రండి: ప్రధానికి చైనా అధ్యక్షుడి ఆహ్వానం


భారత్ పర్యటనలో ఉత్సాహంగా ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన స్వస్థలం జియాన్ కు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరొందిన తమ పట్టణాన్ని తప్పకుండా సందర్శించాలని కోరారు. ప్రముఖ బౌద్ధ సన్యాసి హుయాన్ త్సాంగ్ 2,000 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి తిరిగివచ్చి తన చివరి రోజుల్లో అక్కడే గడిపాడని జిన్ పింగ్ వివరించారు. అంతేగాక, ఏడవ శతాబ్దానికి చెందిన ఓ చైనీస్ సన్యాసి పదహారేళ్లు భారత్ లో ఉండి బౌద్ధ గ్రంథాలను ఔపోసన పట్టారని కూడా తెలిపారు. మళ్లీ అతను తిరిగి చైనా వచ్చినప్పుడు తమ స్వస్థలంలోనే ఉండి బౌద్ధమత ఆలోచనలను అనువదించి, చైనా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేశారని జిన్ పింగ్ చెప్పినట్లు అధికారిక మీడియా చెప్పింది. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మాదాబాద్ నుంచి చైనా అధ్యక్షుడు పర్యటన ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన మన ప్రధానిని తిరిగి ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News