: దుబాయ్ రియల్ ఎస్టేట్ ను పెంచి పోషిస్తోంది మనవాళ్ళేనట!
దుబాయ్ రియల్ ఎస్టేట్ ను పెంచి పోషిస్తోంది భారతీయులేనని ఓ సర్వే తెలిపింది. దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. దుబాయ్ 'రియల్' కొనుగోళ్లలో భారతీయుల వాటా సుమారు 104 బిలియన్ల రూపాయలని సర్వే వివరించింది. 2014 జనవరి నుంచి జూన్ వరకు దుబాయ్ లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐదింట నాలుగు వంతుల పెట్టుబడులు భారత్, బ్రిటిష్, పాకిస్థాన్, జీసీసీ ఇన్వెస్టర్స్ వేనని ఆ సర్వే స్పష్టం చేసింది.