: జోరుమీదున్న సానియా
ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా అదే ఊపును టోక్యో ఓపెన్ లోనూ కనబరుస్తోంది. మహిళల డబుల్స్ విభాగంలో జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్ తో జతకట్టిన సానియా ఈ టోర్నీలో సెమీస్ లోకి దూసుకెళ్ళింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ 6-4, 6-2తో స్విస్ జంట మార్టినా హింగిస్, బెలిండా బెన్సిచ్ పై అలవోకగా నెగ్గింది. సెమీస్ లో సానియా, బ్లాక్ ద్వయం... జెలెనా జెంకోవిచ్, అరాంట్జా శాంటోంజా జోడీతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఈ టోర్నీ ముగిసిన వెంటనే సానియా అట్నుంచి అటే దక్షిణకొరియాలోని ఇంచియాన్ వెళ్ళి ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది.