: ఈ ఉదయం చెన్నైలో మాండలిన్ శ్రీనివాస్ మృతి
ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు యు.శ్రీనివాస్ ఈ ఉదయం మరణించారు. ఆయన వయసు 45 ఏళ్లు. అనారోగ్యంతో ఈ ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 28న శ్రీనివాస్ జన్మించారు. 1998 లో కళారంగంలో ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.