: శ్రీకాళహస్తి ఆలయంలో మాయ లేడి!


శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం రాత్రి మాయ లేడి ఘటన కలకలం రేపింది. శనీశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను మత్తులో పడేసి, వారిని నిలువునా దోచుకునేందుకు యత్నించిన మహిళకు భక్తులు దేహశుద్ధి చేశారు. తన హస్త లాఘవాన్ని ప్రదర్శించేందుకు కార్యరంగం సిద్ధం చేసుకునే క్రమంలో భక్తులకు ఆ మాయ లేడి మత్తు మందు కలిపిన టీని అందించింది. టీ సేవించిన భక్తులు వెంటనే స్పృహ కోల్పోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె, వారి నుంచి విలువైన నగలు, నగదును దోచుకుంది. దీనిని గమనించిన భక్తులు మాయ లేడిని ఒడిసిపట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాయ లేడి చేతిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భక్తులను పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News