: రాబోయే 24 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉందని, ఇదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వారు తెలిపారు.