: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పెప్సీ సీఈఓ ఇంద్రనూయికి మూడో స్థానం


పెప్సీకో సీఈఓ ఇంద్ర నూయి ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్-2014 పేరుతో ఫార్చ్యూన్ సంస్థ ఓ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఇంద్రనూయి కావడం విశేషం. మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ గా అగ్రస్థానాన్ని బిఐఎం ఛైర్మన్, సీీఈఓ జిన్నీరోమెటీ దక్కించుకున్నారు. రెండో స్థానంలో జనరల్ మోటర్స్ సీఈఓ మేరీ బరా ఉన్నారు. గత ఏడాది ఇదే జాబితాలో ఇంద్రనూయి రెండో స్థానంలో ఉన్నారు. గత దశాబ్ద కాలంగా ఫార్చ్యూన్ విడుదల చేసిన మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో ఇంద్రనూయి టాప్-10 లో కచ్చితంగా స్థానం సంపాదిస్తున్నారు. 2006, 2007, 2008, 2009, 2010...ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో అగ్రస్థానంలో నిలవడంతో ఆమె ప్రపంచఖ్యాతిని పొందారు. ఇంద్రనూయి తమిళనాడు కు చెందినవారు.

  • Loading...

More Telugu News