: ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో మరో బ్రిటన్ పౌరుడు


ఇస్లామిక్ మిలిటెంట్లు తాజాగా బ్రిటన్ కు చెందిన ప్రెస్ ఫొటోగ్రాఫర్ ను బందీగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ఉందని గార్డియన్ పత్రిక వెల్లడించింది. బ్రిటన్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ జాన్ క్యాంట్లీను బందీగా చేపట్టినట్టు ఆ వీడియోలో మిలిటెంట్లు ప్రకటించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అమెరికా, బ్రిటన్ లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని ఈ సందర్భంగా క్యాంట్లీ ఆ దేశాలకు విజ్ఞప్తి చేశారు. బ్రిటన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే తాను ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో చిక్కుకోవాల్సి వచ్చిందన్న అతడు, చస్తానో, బతుకుతానో కూడా తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. క్యాంట్లీ దాదాపుగా 22 నెలలుగా మిలిటెంట్ల చెరలో ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

  • Loading...

More Telugu News