: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు సలహాదారుడిగా శ్రీధరన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతి పట్టణాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ టీఎస్(మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్) ప్రాజెక్ట్ లకు ముఖ్య సలహాదారుడిగా ఇ.శ్రీధరన్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢిల్లో మెట్రో ఎండీగా శ్రీధరన్ పనిచేశారు. శ్రీధరన్ టీం ముందుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటిస్తుంది. ఆ తర్వాత, ఈ నగరాల్లో మెట్రోరైల్ ప్రాజెక్ట్ నిమిత్తం అనుసరించాల్సిన విధివిధాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తుంది.