: లాభాలొచ్చే మార్గాలు తెలియకపోతే, రుణాలిచ్చి ప్రయోజనం లేదు: బాబు
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లివాడలో డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాభాలొచ్చే మార్గాలు తెలియకపోతే, ప్రభుత్వాలు ఎన్ని రుణాలు ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే ఆదాయం వస్తుందని సలహా ఇచ్చారు. మహిళా శక్తిపైనా బాబు తన అభిప్రాయాలు తెలిపారు. మహిళలు ఏ పని చేపట్టినా సాధిస్తారని కితాబిచ్చారు. ప్రతి మహిళా ఓ పారిశ్రామికవేత్త కావాలని కోరుకుంటానని అన్నారు.