: ప్రపంచస్థాయికి దరిదాపుల్లో లేని భారత విద్యాసంస్థలు


భారత విద్యాసంస్థలు ఇంకా ప్రపంచస్థాయికి చేరలేదంటోంది క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ జాబితా. ఈ జాబితాలో టాప్-200లో ఒక్క భారత విద్యాసంస్థకూ చోటు దక్కలేదు. బాంబే ఐఐటీకి 222వ ర్యాంకు లభించగా, ఢిల్లీ ఐఐటీకి 235వ ర్యాంకు దక్కింది. ఇక, కాన్పూర్, మద్రాస్, ఖరగ్ పూర్ ఐఐటీలు 300 పైచిలుకు ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ జాబితాకు సంబంధించి టాప్-10లో అమెరికా, యూకేలోని వర్శిటీలు ఉన్నాయి. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. ఆసియా నుంచి నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ కు అత్యుత్తమంగా 22వ ర్యాంకు లభించింది. కాగా, భారత ఉన్నత విద్యాసంస్థల స్థితిగతులపై యూపీఏ హయాంలో ఓ కమిటీ వేసినా ప్రయోజనం శూన్యం.

  • Loading...

More Telugu News