: ఎల్ అండ్ టీ రాసిన లేఖ పత్రికల్లో వస్తే తప్పు ఎలా అవుతుంది?: కిషన్ రెడ్డి
హైదరాబాదు మెట్రో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ పత్రికల్లో రావడం ఎందుకు తప్పవుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 'మీరు, మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చుగానీ, బయటికి తెలియడం సరైంది కాదని ఎలా అంటారు?' అని నిలదీశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి... ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ వాస్తవాలు కప్పిపుచ్చి పత్రికలపై నిందలు వేయడం సరికాదన్నారు. ఇక, అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా ప్రభుత్వం ప్రతిసారీ మాట మారుస్తోందని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని జరిపేంతవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. మెట్రో ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ మరో నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారో బయట పెట్టాలన్నారు.