: మరో వివాదంలో అమీర్ ఖాన్


బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు వివాదాలు కొత్తకాదు. తాజాగా, 'పీకే' సినిమా షూటింగ్ సందర్భంగా అమీర్ ఓ ఆలయంలోకి చెప్పులు వేసుకుని ప్రవేశించడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలోని నాసిక్ లో 'పీకే' షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో, అమీర్ స్లిపర్స్ వేసుకుని 'కాలా రామ్ మందిర్' ప్రాంగణంలోకి వెళ్ళినట్టు ఫొటోల్లో కనిపించింది. ఆ సమయంలో అమీర్ సెక్యూరిటీ సిబ్బంది తమ షూ వెలుపలే విడిచివచ్చారు. అమీర్ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ విషయంపై తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అమీర్ ఖాన్ ప్రతిస్పందన తెలియరాలేదు.

  • Loading...

More Telugu News