: ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జ్


ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి నుంచి తన షూటింగ్ లో పాల్గొంటారని ఆయన మేనేజర్ మీడియాకు తెలిపాడు. "ప్రస్తుతం కమల్ సర్ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు" అని చెప్పాడు. ఇటీవల కేరళ మారుమూల ప్రాంతాల్లో 'పాపనాశం' చిత్రం షూటింగ్ చేశారు. ఆ సమయంలో అక్కడి రోడ్డుపక్క దాబాల్లో ఆహారం, కలుషిత నీరు తీసుకోవడంతో అస్వస్ధతకు గురయ్యానని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News