: తుపాకీతో బెదిరించిన ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని


హైదరాబాద్ కూకట్ పల్లిలో కృష్ణవేణి ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్ మధ్య ఓ బస్సు విషయంలో వివాదం చెలరేగింది. దీంతో, కృష్ణవేణి ట్రావెల్స్ యజమానిని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని తుపాకీతో బెదిరించారు. దీంతో, ఆయన కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరెంజ్ ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు ట్రావెల్స్ మధ్య లావాదేవీల విషయంలో వివాదం రేగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News