: చైనాలో ఆన్ లైన్ వ్యభిచారంలో 68 మంది అరెస్టు


చైనాలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, మైక్రోబ్లాగ్లు, మెసేజ్ సర్వీసుల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అశ్లీల నిరోధక విభాగం అధికారులు పట్టుకున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన యాప్ ల సహాయంతో ఇన్నాళ్ళూ మూడో కంటికి తెలియకుండా వ్యభిచారం నిర్వహిస్తూ, అశ్లీల చిత్రాలను షేర్ చేస్తున్న వారి ఆట కట్టించారు. ఈ మేరకు అశ్లీల నిరోధక విభాగం అధికారులు ఇంటర్నెట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. బీజింగ్ లో 25 మందిని, దక్షిణ చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో మరో 37 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైనాలో అశ్లీల ఇంటర్నెట్ సేవలపై నిషేధం అమలులో ఉంది.

  • Loading...

More Telugu News