: ఇడ్లీ, దోశ, పొంగల్ ఇష్టంగా తిని ఆరు గంటలు కష్టపడ్డ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్


ప్రపంచంలోని ప్రతి జిమ్ లోనూ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఫొటోలు దర్శనమిస్తుంటాయి. అంతటి ఫేమస్ స్టార్ భారత్ వచ్చి 'ఐ' ఆడియో లాంఛ్ ఫంక్షన్ లో పాల్గొన్నాడు. దీంతో, భారత మీడియా మొత్తం ఈ టెర్మినేటర్ పై దృష్టి కేంద్రీకరించింది. ఈ సందర్భంగా పలు విశేషాలను బహిర్గతం చేసింది. విదేశీయులు సాధారణంగా తినే వంటకాలను పక్కన పెట్టిన ఈ హాలీవుడ్ సూపర్ స్టార్ ఇడ్లీ, దోశ, పొంగల్ ఇష్టంగా తిన్నాడు. ఆ తరువాత ఆరు గంటల సేపు చెమటలు కక్కేలా వర్కవుట్లు చేశాడు. వర్కవుట్లపై అతని అంకితభావం చూసిన 'ఐ' సినిమా యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట. అరవై ఏళ్లు దాటిన ష్వార్జ్ నెగ్గర్ ఇప్పటికీ కుర్రాడిలా కనిపించడం వెనుక కారణం అదేనని అర్థం చేసుకున్నారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ముఖ్యమంత్రిని కలవాలని భావించిన ఆర్నాల్డ్ పంచెకట్టుకునే సమయం సరిపోదని భావించి సూట్ లోనే ఆమెను కలిశాడు.

  • Loading...

More Telugu News