: జమ్మూకాశ్మీర్ లో 'రెస్క్యూ బోట్'ను హైజాక్ చేసిన యాసిన్ మాలిక్


భారీ వరదల కారణంగా నిరాశ్రయులుగా మారి జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడి ప్రజలకు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు సరఫరా చేసే ఓ రెస్క్యూ బోట్ ను మాలిక్ వర్గం హైజాక్ చేసినట్లు సమాచారం. ఈ నెల 13న తన అనుచరులతో వచ్చిన మాలిక్ కాశ్మీర్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ చేస్తున్న సహాయక చర్యలకు అడ్డుపడ్డాడట. అదే సమయంలో వారు బోటును తీసుకెళ్లారని ఓ వీడియా ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, అటు పలు ఆంగ్ల చానల్స్ కూడా ప్రసారం చేశాయి. అక్కడ సహాయం చేస్తున్న వారిని బోటు వదిలిపెట్టి వెళ్లాలని, రక్షణ చర్యలు తామే చేపడతామని డిమాండ్ చేశారట. అంతేగాక, ఆర్మీ బోటులో అనారోగ్యంతో ఉన్న కొందరు మహిళలను కిందికి దిగాలని హెచ్చరించారట. ఇక ఆర్మీ సహాయక చర్యలు కొనసాగాలని కాశ్మీరీలు కోరుకోవడంలేదని జేకేఎల్ఎఫ్ చీఫ్ అన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News