: బాలిక కడుపు నొప్పితో వెలుగు చూసిన ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం


వావివరసలు, వయసు తారతమ్యాలు మరచిన కీచక ప్రధానోపాధ్యాయుడి బండారం బట్టబయలైంది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా సురకుంది గ్రామంలో ఓ పదకొండేళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని తన తల్లికి చెప్పడంతో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా దారుణం వెలుగు చూసింది. చాలా కాలంగా తన కుమార్తెను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News