: ఆ బాలుడ్ని అతని బాబాయే హత్య చేశాడు: ఎస్పీ
ఖమ్మం జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అనంతరం హత్యకు గురైన ఆరేళ్ల బాలుడు నిషాంత్ ను అతని బాబాయే హత్య చేసినట్టు ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే నిషాంత్ ను అతని బాబాయి హత్య చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. విచారణలో నిషాంత్ బాబాయ్ మధు నేరాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు.